: భారత్ లో మైక్రోసాఫ్ట్ ఆదాయం రెట్టింపు!
ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఆదాయాన్ని భారత్ లో రెట్టింపు చేసుకుంది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలను భారత వినియోగదారులు పెద్ద సంఖ్యలో అప్ గ్రేడ్ చేసుకున్న క్రమంలోనే ఈమేర వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది రూ.1,003 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన మైక్రోసాఫ్ట్, ఈ ఏడాది ఒకేసారి రూ.2,245 కోట్ల మేర ఆదాయాన్ని రాబట్టింది. దీంతో ఈ ఒక్క ఏడాదిలోనే తన ఆదాయాన్ని ఆ సంస్థ రెట్టింపు చేసుకున్నట్లైంది. లైసెన్సు ధరలు పెరిగిన నేపథ్యంలోనూ సంస్థ ఆదాయంలో భారీ పెరుగుదల నమోదైందన్న వాదన కూడా వినిపిస్తోంది. మైక్రోసాప్ట్, తన ఉత్పత్తులను భారత్ లో విక్రయించేందుకు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట శాఖను నెలకొల్పిన సంగతి తెలిసిందే.