: జయలలిత తిరిగి అధికారంలోకి రావడం కల: కరుణానిధి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత కరాగారంలోకి వెళ్లిన పన్నెండు రోజుల తరువాత డీఎంకే అధినేత కరుణానిధి స్పందించారు. ఈ మేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జయలలిత తమిళనాడులో తిరిగి అధికారంలోకి రావడం అనేది ఒక కల మాత్రమేనన్నారు. ఇక అదెప్పటికీ నెరవేరదని చెప్పారు. తను తవ్వుకున్న గోతిలో తానే పడిందన్నారు. తననెవరూ ప్రశ్నించలేరనే పరిస్థితిని సృష్టించిన ఆమె, ఇప్పుడు తన పతనం తాలూకు పాఠాలు చదవుకునే పరిస్ధితి ఏర్పడిందని కరుణ వ్యాఖ్యానించారు. తనకు తెలియకుండానే ద్రవిడ ఉద్యమాన్ని పైకి తీసుకురావడానికి ఆమె సాయం చేశారన్నారు.