: పాక్ కాల్పులపై మోడీ స్పందించాల్సిన అవసరం లేదు: రాజ్ నాథ్ సింగ్


గత రెండు రోజుల నుంచి జమ్మూకాశ్మీర్ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ తీవ్ర కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు భారత జవాన్లు కూడా గట్టిగానే సమాధానమిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, పాక్ కాల్పులపై ప్రధానమంత్రి స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే, మన బీఎస్ఎఫ్ జవాన్లు అందుకు తగినట్టుగానే జవాబిస్తున్నారని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం సంతృప్తిగానే ఉందన్నారు. నిరంతరం ఏం జరుగుతోందో అన్నీ తెలుసుకుంటున్నారని, ఓ కన్నేసుంచారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News