: చంద్రబాబు, కేఈల మధ్య పెరుగుతున్న అగాధం!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిల మధ్య నానాటికీ అగాధం పెరిగిపోతోందట. తన ఆధ్వర్యంలోని రెవెన్యూ శాఖ అధికారుల బదిలీల్లో చంద్రబాబు తలదూర్చడమే కాక కొడుకు లోకేశ్ ఫిర్యాదుతో తనను మందలించే రీతిలో వ్యవహరించిన వైనంపై కేఈ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని సమాచారం. ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినా, కేబినెట్ లో తనకేమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని గత కొంతకాలంగా కేఈ మధనపడుతున్న సంగతి తెలిసిందే. కొత్త రాజధాని నిర్ణయంలో రాయలసీమ జిల్లాలలను పూర్తిగా విస్మరించడంపైనా కేఈ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే రాజధాని కమిటీలో చేరేందుకు కూడా ఆయన నిరాకరించాలని తెలుస్తోంది. తాజాగా రెవెన్యూ శాఖ బదిలీల్లో బాగంగా కొందరు అధికారుల ఫిర్యాదుతో లోకేశ్, తన తండ్రి చంద్రబాబు వద్ద పంచాయతీ పెట్టారట. దీంతో కేఈని పిలిపించిన చంద్రబాబు, ఆయనకీ క్లాస్ పీకినంత పనిచేశారని సమాచారం. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న తనను, లోకేశ్ ఫిర్యాదుతో చంద్రబాబు మందలించడాన్ని కేఈ జీర్ణించుకోలేకపోయారు. ఈ నేఫథ్యంలో బదిలీల ఫైలును చంద్రబాబుకే అప్పగించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News