: తుపాను హెచ్చరికతో జిల్లా అధికారులతో ఏపీ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్


'హుదూద్' తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. అటు తుపాను దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లాలో అధికారుల సెలవులు రద్దు చేశారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను కలెక్టర్ సిద్ధం చేయిస్తున్నారు.

  • Loading...

More Telugu News