: 'హుదూద్' తుపాను నేపథ్యంలో చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన రద్దు
అండమాన్ లో ఏర్పడ్డ అల్పపీడనం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, రేపు నిర్వహించనున్న శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హుదూద్ తుపాను నేపథ్యంలో సీఎం పర్యటన ఈ నెల 17కు వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా రేపు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తుపాను హెచ్చరికలతో జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తీరంలోని 11 మండలాల్లో నిత్యావసరాలను సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.