: మరోసారి కేసీఆర్ ను కలసిన తలసాని
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో టీఆర్ఎస్ లో చేరే అంశంపై తలసాని మాట్లాడినట్లు తెలుస్తోంది. గతంలో రెండుసార్లు ఇలాగే కేసీఆర్ ను ఆయన కలవడంతో గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని వార్తలు వచ్చాయి. కానీ, అలాంటిదేమీలేదని, కుమార్తె పెళ్లికంటూ ఒకసారి, పండగ పిలుపుకని మరోసారి తెలంగాణ సీఎంను కలసినట్లు తలసాని మీడియాకు చెప్పుకొచ్చారు. మరి ఈసారెందుకు కలిశారనేది ఆలోచనకందని విషయం. ఏదేమైనా, తలసాని టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలంగాణ రాజకీయ సీనియర్ నేతలు అంటున్నారు.