: నిప్పంటించిన ఘటనలో ముస్తఫా మృతి, మెహిదీపట్నంలో ఉద్రిక్తత


హైదరాబాద్ లో గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాలుడు ముస్తఫా గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్న మెహిదీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బుధవారం మధ్యాహ్నం తర్వాత మెహిదీపట్నంలోని మిలిటరీ క్వార్టర్స్ పరిధిలో ముస్తఫాపై కిరోసిన్ పోసిన వ్యక్తులు అతడి ఒంటికి నిప్పు పెట్టారు. దీంతో 90 శాతం గాయాలైన ముస్తఫాను తొలుత ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం అతడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం కాలిన గాయాలతో కోలుకోలేక బాలుడు మృతి చెందాడు. దీంతో మెహిదీపట్నం ప్రాంతంలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన పోలీసులు, మిలిటరీ క్వార్టర్స్ ముందు భారీ సంఖ్యలో మోహరించారు. మిలిటరీ దుస్తుల్లో ఉన్న వ్యక్తులే తనను తగులబెట్టారని తన వాంగ్మూలంలో ముస్తఫా పేర్కొన్నాడు. అయితే ముస్తఫా ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని మిలిటరీ వాదిస్తోంది.

  • Loading...

More Telugu News