: డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ. 10 వేలు ఫైన్ కట్టాల్సిందే!


ఇకపై వాహనాలు నడిపే వారు అన్నీ సరిచూసుకున్న తర్వాతే రోడ్డెక్కాలి. లేకపోతే అంతే సంగతులు... వీపు విమానం మోత మోగిపోతుంది. వివరాల్లోకి వెళ్తే... నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి, కొత్త వాహన చట్టానికి రూపకల్పన చేసింది. దీని ప్రతిపాదనల ముసాయిదాను కేంద్ర ఉపరితల రవాణాశాఖ నిన్న తెలంగాణ ప్రభుత్వానికి పంపింది. కొత్త చట్టం ప్రకారం... డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ. 10 వేలు జరిమానా విధిస్తారు. హెల్మెట్ లేకపోతే రూ. 500, ఇన్స్యూరెన్స్ లేకపోతే రూ. 10 వేలు, సరైన పత్రాలు లేకపోతే రూ. 5 వేలు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రూ. 5 వేలు, మద్యం సేవించి వాహనం నడిపితే రూ. 2,500 జరిమానా విధిస్తారు. బెల్టు లేకుండా నాలుగు చక్రాల వాహనాలు నడిపితే రూ. 1000 జరిమానా వడ్డిస్తారు. మూడు సార్లు పట్టుబడితే వాహనం జప్తు లేదా లైసెన్స్ రద్దు కానీ చేస్తారు. ప్రతిపాదనలు డ్రాఫ్టు రూపంలో వచ్చినట్టు రవాణాశాఖ కమిషనర్ జగదీశ్వర్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News