: తుపాను నేపథ్యంలో టీఆర్ఎస్ ప్లీనరీ వాయిదా
అనుకున్నదే జరిగింది. ముంచుకొస్తున్న హుదూద్ తుపాను నేపథ్యంలో, ఈ నెల 11న జరగాల్సిన ప్లీనరీ సమావేశాలను టీఆర్ఎస్ వాయిదా వేసింది. ఈ నెల 18న ప్లీనరీ, 19న బహిరంగసభ జరుగుతాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఎల్బీ స్టేడియంలో ప్లీనరీని, పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగసభను నిర్వహిస్తారు. తుపాన్ నేపథ్యంలో, తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని... దీంతో, కార్యకర్తలకు ఇబ్బంది కలగకూడదనే షెడ్యూల్ మార్చినట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.