: హైదరాబాదులో సల్మాన్, సైఫ్ లపై కేసు


ప్రముఖ బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ లపై హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ముంబయిలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ఒక మతానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వీరిద్దరూ దుస్తులు ధరించారని, వీరిపై కేసు నమోదు చేయాలని మొఘల్ పురాకు చెందిన ఫసియుద్దీన్ అనే వ్యక్తి కోర్టును అభ్యర్థించారు. దీంతో, వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 295(ఏ) కింద కేసు నమోదు చేయాలని మూడవ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో సల్మాన్, సైఫ్ లపై కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News