: 'హుదూద్'తో పెను బీభత్సం తప్పదా?
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల వైపు దూసుకొస్తున్న 'హుదూద్' తుపాను ఈ నెల 12న తీరాన్ని దాటే అవకాశం ఉంది. గత ఏడాది సంభవించిన 'పైలీన్' తుపాను తర్వాత మళ్లీ అంతటి స్థాయిలో విరుచుకుపడనున్న తుపాను హుదూద్ అని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. పైలీన్ అంత తీవ్రత లేకున్నప్పటికీ... హుదూద్ కూడా పెను బీభత్సాన్ని సృష్టిస్తుందని చెబుతున్నారు. పైలీన్ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 210 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే... హుదూద్ తీరం దాటే సమయంలో గంటకు 155 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. హుదూద్ 24 గంటల్లో తీవ్ర తుపానుగా, 36 గంటల్లో పెను తుపానుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.