: 'హుదూద్' అంటే ఏమిటి?


రెండు రోజుల క్రితం అండమాన్ తీరంలో ఏర్పడి... ఏపీ, ఒడిశా వైపు దూసుకొస్తున్న తుపానుకు 'హుదూద్' అని నామకరణం చేశారు. అయితే, హుదూద్ అంటే ఏమిటి? అనే ప్రశ్న సాధారణంగా అందరిలో తలెత్తుతుంది. హుదూద్ అంటే... ఒమన్ దేశానికి చెందిన ఓ పక్షి. ఆ పక్షి పేరుతోనే ఈ తుపానును పిలుస్తున్నారు. తుపాన్లకు పేర్లు పెట్టే సాంప్రదాయాన్ని గత కొన్నేళ్లుగా ఆచరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో తుపాన్లు ఏర్పడుతున్న రీత్యా... ఏ తుపాను ఎక్కడ ఏర్పడింది? ఎంత విధ్వంసం సృష్టించింది? తదితర టెక్నికల్ డేటా కోసం తుపానులకు పేర్లు పెడుతున్నారు. ఒక తుపానుకు, మరో తుపానుకు మధ్య కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకే ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు.

  • Loading...

More Telugu News