: ప్రధాని పదవి ప్రతిష్ఠను మోడీ దిగజారుస్తున్నారు: శరద్ పవార్
ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోడీ, ఆ పదవి హోదాను దిగజారుస్తున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో అందుబాటులో లేకుండా ప్రధాని మోడీ, ఎన్నికల పర్యటనల పేరిట రాష్ట్రాలు తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. "మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని ఒకటో, రెండో ర్యాలీల్లో పాల్గొనడం సాధారణమే. అయితే బీజేపీకి అన్నీ తానై వ్యవహరిస్తున్న మోడీ, ప్రధాని పదవిని పక్కనబెట్టి, ఎన్నికల ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరించడం సరికాదన్నారు. తాలూకా స్థాయి ర్యాలీల్లో పాల్గొనడం ద్వారా మోడీ, ప్రధాని పదవి ప్రతిష్ఠను మంటగలుపుతున్నారు" అని ఆయన ఆరోపించారు. ఓ వైపు పాక్ దుశ్చర్యలు నానాటికీ పెరుగుతున్న క్రమంలో ప్రధాని ఢిల్లీలో అందుబాటులో లేకపోవడం, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం పేరిట ఇంటికే పరిమితం కావడం జాతీయ భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.