: గుంటూరు జిల్లా పరిధిలో రాజధాని నిర్మిస్తాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని గుంటూరు జిల్లా పరిధిలో నిర్మిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. విజయవాడ పరిసరాల్లో రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినా, ఆ ప్రాంతంలో ఎక్కడ అన్న విషయంపై అంత స్పష్టత లేదు. ఈ స్పష్టతకు చెక్ పెడుతూ బుధవారం చంద్రబాబు, గుంటూరు జిల్లా పరిధిలో రాజధానిని నిర్మిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటు కావడం ఖాయమైనట్టే. బుధవారం వినుకొండ నియోజకవర్గ పరిధిలోని సవల్యపురంలో పర్యటించిన సందర్భంగా చంద్రబాబు ఈ మేరకు ప్రకటించారు. రాజధాని నిర్మాణంలో ఇంటింటి నుంచి ఓ ఇటుకను సేకరిస్తామని ఆయన వెల్లడించారు.