: చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన లేదు: శైలజానాథ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేదని కాంగ్రెస్ నేత శైలజానాథ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు రైతు రుణమాఫీ అని చెప్పిన చంద్రబాబు అధికారంలో కొచ్చాక ఆంక్షలు విధిస్తూ, బాండ్ల పేరిట తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి అని ఆయన స్పష్టం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తికి చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆయన పేర్కొన్నారు. పోలవరం నుంచి హంద్రీనీవాకు నికర జలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.