: ఆ ఏడుగురు క్రీడాకారుల కోసం జల్లెడ పడుతున్న కొరియా పోలీసులు


దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరిగిన ఆసియా క్రీడల్లో సుమారు పది వేల మంది అథ్లెట్లు పాల్గొన్నారు. వారిలో ముగ్గురు నేపాల్ క్రీడాకారులు, ఇద్దరు శ్రీలంక క్రీడాకారులు, బంగ్లాదేశ్, పాలస్తీనాకు చెందిన చెరో అథ్లెట్ ఆయాదేశాలకు తిరిగి వెళ్లలేదు. అలాగే పాకిస్థాన్ కు చెందిన ఓ టీవీ రిపోర్టర్ ఆచూకీ కూడా లభ్యం కాలేదు. దీంతో వీరికోసం కొరియా పోలీసులు జల్లెడ పడుతున్నారు. సమీపంలోని అన్నాన్ పట్టణంలో వెతుకుతున్నారు. ఈ ఎనిమిది మంది అక్కడ జీవనోపాధి పొందేందుకు వెళ్లి ఉంటారని కొరియా పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ ఎక్కువ మంది అక్రమ వలసదారులు ఉంటారని వారు తెలిపారు. అథ్లెట్లకు వీసా అక్టోబర్ 19 వరకు గడువు ఉండగా, రిపోర్టర్ కు అక్టోబర్ 30 వరకు గడువు ఉంది.

  • Loading...

More Telugu News