: ఊపందుకున్న రేవ్ పార్టీలు...హైదరాబాద్ మారుతోంది!


హైదరాబాదు సంస్కృతి అత్యంత వేగంగా మారుతోంది. పాశ్చాత్య సంస్కృతి మోజులో యువత పెడదారి పడుతోంది. రేవ్ పార్టీ నిర్వహిస్తూ కొందరు పట్టుబడడంతో హైదరాబాదులో రేవ్ పార్టీ సంస్కృతిపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. హైదరాబాదు శివార్లలో వారాంతాల్లో బడాబాబులు రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. పబ్బులు, క్లబ్బులు పెరిగిపోవడంతో పెద్దింటి యువత మజా కోసం రేవ్ పార్టీలను ఆశ్రయిస్తున్నారు. రేవ్ పార్టీల కోసం ముంబై నుంచి యువతులను రప్పిస్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్ లో పట్టుబడిన రేవ్ పార్టీలో కూడా ఆరుగురు యువతులు, ఇద్దరు మైనర్లు ఉన్నట్టు సమాచారం. రేవ్ పార్టీలో నగ్నంగా డ్యాన్సులు చేయించినట్టు తెలుస్తోంది. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకోగా మంగళవారం వరకు వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు. దీంతో పోలీసుల వ్యవహార శైలిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. రేవ్ పార్టీలో బడాబాబుల కుమారులు పలువురు ఉన్నట్టు సమాచారం. వారిని తప్పించేందుకే పోలీసులు ఇలా వ్యవహరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే వారిని తప్పించేందుకు పెద్దఎత్తున డబ్బు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా, రేవ్ పార్టీల సంస్కృతి గోవా నుంచి హైదరాబాదుకు పాకడం ఆందోళన కలిగించే అంశమే.

  • Loading...

More Telugu News