: వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డికి తప్పిన ముప్పు


వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఎల్లంపల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడగా, ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. రోడ్డుపైకి వస్తున్న జంతువును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు ఆయన తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News