: ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ అమ్మకంపై ఫిర్యాదులు వచ్చాయి: మంత్రి నిర్మలా సీతారామన్


దసరా పండుగ నేపథ్యంలో 'ఫ్లిప్ కార్ట్' ప్రవేశపెట్టిన భారీ డిస్కౌంట్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు వచ్చినట్లు వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చాలామంది ఆందోళన కూడా వ్యక్తం చేసినట్లు చెప్పారు. దానిపై తప్పకుండా పరిశీలిస్తామన్నారు. ప్రస్తుతం ఈ విషయంపై స్టడీ చేస్తున్నామని, ఒకవేళ ప్రత్యేక విధానం లేక ఈ-కామర్స్ రిటైల్ వ్యాపారంపై స్పష్టత అవసరమా? అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నామన్నారు. త్వరలో దీనిపై ఓ ప్రకటన చేస్తామని చెప్పారు. 'బిగ్ బిలియన్ డే' స్కీం పేరుతో ఫ్లిప్ కార్ట్ ఇటీవల ఇచ్చిన ఆఫర్ డిస్కౌంట్ కు 1.5 మిలియన్ల మంది తమ పోర్టల్ లో షాపింగ్ చేశారని, పది గంటల్లో రూ.600 కోట్ల ఉత్పత్తులు అమ్ముడయ్యాయని సదరు సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News