: మైదానంలోకొచ్చిన విండీస్ ఆటగాళ్ళు... కొచ్చి వన్డే జరిగేనా..?
వెస్టిండీస్ క్రికెటర్లకు, వారి బోర్డుకు మధ్య ఎన్నాళ్ళ నుంచో పారితోషికం విషయంలో విభేదాలు ఉన్నాయి. టీమిండియాతో వన్డే సిరీస్ నేడు ఆరంభం అవ్వాల్సి ఉండగా, ఆ గొడవల కారణంగా ఏకంగా సిరీస్ నిర్వహణపైనే అనుమానాలు తలెత్తాయి. షెడ్యూల్ ప్రకారం మరికాసేపట్లో కొచ్చిలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి వన్డే ఆరంభం కావాలి. తమ సమస్యలు పరిష్కరించకపోతే మ్యాచ్ ఆడబోమని విండీస్ ఆటగాళ్ళు ఈ ఉదయం తమ బోర్డును హెచ్చరించడంతో కొచ్చి వన్డే నిర్వహణ సందిగ్ధంలో పడింది. తాజాగా, విండీస్ ఆటగాళ్ళు మైదానంలోకి రావడంతో మ్యాచ్ నిర్వహణ అవకాశాలు మెరుగయ్యాయి.