: త్వరలో రుమేనియా స్క్రీన్లపై 'ఇంగ్లిష్ వింగ్లిష్'


ఓ భారతీయ గృహిణి సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ఆంగ్ల భాష నేర్చుకోవడానికి చేసిన ప్రయత్నమే 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమా. చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో అందాల సుందరి శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. 2012 అక్టోబరులో ఇండియాలో రిలీజ్ అయి ఘనవిజయ సాధించిన ఈ సినిమాను త్వరలో రుమేనియాలోని పదిహేను స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు. ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ దీనిని రీలీజ్ చేస్తుంది. అంతకుముందు జర్మనీ, జపాన్ లోనూ ఈ చిత్రం విడుదలై, విజయవంతమైంది.

  • Loading...

More Telugu News