: గుంటూరు జిల్లా వినుకొండలో చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వినుకొండలోని లయోలా హైస్కూలులో నీరు- చెట్టు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, మొక్కలు నాటే కార్యక్రమాన్ని అందరూ ఉద్యమంగా చేపట్టాలన్నారు. మరోవైపు ఈ నెల 14న కడపలో చంద్రబాబు పర్యటించనున్నారు. అక్కడి నూతన విమానాశ్రయాన్ని బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పలువురు మంత్రులు పాల్గొంటారు.