: యూపీ అమ్మాయిలతో పోకిరీ చేష్టలు ఇక చెల్లవేమో!


మహిళలపై దాడుల రేటు ఎక్కువగా నమోదయ్యే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ముందు వరుసలో ఉంటుంది. అందుకే, విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇవ్వాలని యూపీ సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలో సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ కు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థినులకు కరాటే, జూడో వంటి పోరాట విద్యలు తప్పనిసరిగా బోధించాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. మహిళలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం అఖిలేశ్ యాదవ్ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, స్కూళ్లలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కార్యక్రమానికి యూపీ జూడో సమాఖ్య జనరల్ సెక్రటరీ మునవ్వర్ అంజార్ సలహాదారుగా నియమితులయ్యారు.

  • Loading...

More Telugu News