: రేవంత్ రెడ్డికి మైహోమ్ రామేశ్వరరావు పరువునష్టం నోటీసులు


టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిపై మైహోమ్ ఛైర్మన్ రామేశ్వరరావు పరువు నష్టం నోటీసులు పంపారు. మైహోమ్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా మెట్రో భూములను కట్టబెట్టిందంటూ రామేశ్వరరావును ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన మిత్రుడైన రామేశ్వరరావుకు రూ. 2000 కోట్ల విలువైన భూములను కేసీఆర్ కట్టబెట్టారని రేవంత్ పదేపదే ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న రేవంత్ పై పరువు నష్టం దావా వేస్తానని గతంలో రామేశ్వరరావు హెచ్చరించారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ, పరువునష్టం దావా వేస్తానన్న వారు ఇంతవరకు వేయలేదని... పరువునష్టం దావాను తాను స్వాగతిస్తానని నిన్న రేవంత్ ప్రకటించారు. ఈ క్రమంలో, తన పరువుకు భంగం కలిగేలా రేవంత్ వ్యవహరించారని... పరువునష్టం కింద రేవంత్ రూ. 90 కోట్లు చెల్లించాలని అడ్వొకేట్ ద్వారా రామేశ్వరరావు నోటీసులు పంపించారు. అంతేకాకుండా, రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని... వారంలోగా రూ. 90 కోట్లు చెల్లించాలని... లేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News