: సందిగ్ధంలో భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్
కొచ్చిలో ఈరోజు జరగాల్సిన భారత్-వెస్టిండీస్ వన్డే మ్యాచ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. వెస్డిండీస్ క్రికెటర్ల పారితోషికంలో విండీస్ బోర్డు ఇటీవలే 75 శాతం కోత విధించింది. ఈ నేపథ్యంలో తమ పారితోషికం పెంచాలంటూ ఆటగాళ్లు బోర్డును డిమాండ్ చేస్తున్నారు. దాంతో, అలకబూనిన విండీస్ క్రికెటర్లు నిన్న (మంగళవారం) కొచ్చిలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్ కు రాకపోగా అటు విలేకరుల సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో నేడు జరగనున్న మ్యాచ్ మాత్రమే కాకుండా మొత్తం సిరీస్ జరుగుతుందా? అన్న సందేహం నెలకొంది.