: నిరాశలో సానియా మీర్జా... ఆనందంలో కుంబ్లే
ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తీవ్ర నిరాశకు గురైంది. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను సందర్శించాలని ఆమె నిన్న అక్కడకు వెళ్లింది. అయితే, అప్పటికే సాయంత్రం కావడం... సందర్శన సమయం మించిపోవడంతో గేట్లు మూసివేసినట్టు టూరిస్ట్ గైడ్ ఆమెకు తెలిపాడు. దీంతో ఆమె తీవ్ర నిరాశ చెందింది. ఎప్పట్నుంచో తాజ్ మహల్ చూడాలన్న కోరికతో వచ్చానని... తీరా వచ్చేసరికి ఇలా అయిందంటూ సానియా ఆవేదనకు లోనయింది. మరోవైపు, ప్రఖ్యాత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే నిన్న తాజ్ మహల్ ను సందర్శించాడు. తాజ్ అందాలను చూసి మురిసిపోయాడు. కుంబ్లే, సానియా ఇద్దరూ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి ఆగ్రా విచ్చేశారు.