: నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న కేసీఆర్
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జోడేఘాట్ లో జరగనున్న కొమరం భీమ్ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 11.50 గంటలకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదిలాబాద్ బయలుదేరుతారు. మధ్యాహ్నం 1 గంటకు జోడేఘాట్ చేరుకుని భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళి అర్పిస్తారు. అనంతరం భీమ్ స్మృతి చిహ్నాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత గిరిజన దర్బార్ కు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.