: షుమాకర్ కోలుకుంటున్నాడు... కానీ, ఫార్ములా-1 కారు డ్రైవ్ చేయలేకపోవచ్చు!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్ములా వన్ దిగ్గజం మైఖేల్ షుమాకర్ క్రమంగా కోలుకుంటున్నాడు. ఆల్ఫ్స్ పర్వతాల్లో స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురైన షుమాకర్ కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన తన నివాసానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో, షుమాకర్ ను 'ఫెర్రారీ' మాజీ బాస్ జీన్ టాడ్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, "షుమాకర్ క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. రానున్న రోజుల్లో అతను తన జీవితాన్ని అందరిలాగానే సంతోషంగా గడుపుతాడు. కానీ, మళ్లీ ఫార్ములా వన్ కారును మాత్రం డ్రైవ్ చేయలేకపోవచ్చు" అని వెల్లడించాడు.