: మూతపడనున్న చెన్నై 'నోకియా' ప్లాంట్... 1100 మంది భవిష్యత్తు ప్రశ్నార్థకం


తమ ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఉర్రూతలూపిన మొబైల్ ఫోన్ల దిగ్గజం నోకియాకు టైం ఏమీ బాగాలేదు. స్మార్ట్ ఫోన్ల యుగంలో నోకియా పూర్తిగా వెనుకబడి పోయి బేల చూపులు చూస్తోంది. ఈ తరుణంలో నోకియా తన ఉత్పత్తులను కూడా క్రమంగా తగ్గించుకుంటున్నట్టు కనిపిస్తోంది. తాజాగా... చెన్నైలోని ప్లాంట్ ను వచ్చే నెల 1వ తేదీ నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాంట్ లో తయారయ్యే ఉత్పత్తుల కొనుగోలు ఒప్పందాన్ని మైక్రోసాఫ్ట్ రద్దు చేసుకోవడమే దీనికి కారణం. మైక్రోసాఫ్ట్ నిర్ణయంతో ప్లాంట్ ను మూసివేయడం మినహా తమకు మరో మార్గం లేదని నోకియా ప్రతినిధి తెలిపారు. దీంతో, ఈ ప్లాంట్ లో పనిచేస్తున్న 1,100 మంది ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడింది.

  • Loading...

More Telugu News