: ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేల రహస్య భేటీ... పార్టీ వీడేందుకేనా?


తెలంగాణ టీడీపీలో ముసలం పుట్టేలా ఉంది. కొందరు టీడీపీ నేతలు పార్టీ వీడుతారన్న ప్రచారం నేపథ్యంలో ఆరుగురు టీడీపీ నేతలు సాగిస్తున్న రహస్య మంతనాలు ఆసక్తి రేపుతున్నాయి. గత కొంత కాలంగా టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. దీనికి తోడు ఇప్పుడు సమావేశమైన నేతలు టీడీపీలో క్రియాశీలకంగా లేనట్టు సమాచారం. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి, తీగల, సాయన్న, మాధవరం కృష్ణారావు, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీలు జూబ్లీహిల్స్ లోని ఓ ప్రదేశంలో రహస్య మంతనాల్లో మునిగారు. తెలంగాణ టీడీపీలో వీరి వ్యవహార శైలిపై పలు అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి రహస్య మంతనాల అజెండా ఏమిటో మరి కాసేపట్లో తెలిసే అవకాశముంది. ఒకవేళ ఇదే జరిగితే తెలంగాణలో టీడీపీ పుట్టి మునుగుతుంది. తెలంగాణలో ఒకేసారి మూకుమ్మడిగా పార్టీ మారాలా? లేక ఒక్కొక్కరుగా పార్టీ వీడాలా? అని సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. అలాగే టీడీపీలో ఉంటే ఉండే ప్రయోజనాలు ఏంటి? టీఆర్ఎస్ లోకి వెళితే ప్రయోజనాలు ఏవిటి? అనే విషయాలపై సమాలోచనలు జరుగుతున్నట్టు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News