: మా వాటా కరెంటు ఎందుకివ్వరు?: హరీష్ రావు


ఆర్టీపీపీలో బొగ్గు కొరత లేకపోయినా ఉద్దేశపూర్వకంగా విద్యుదుత్పత్తి నిలిపేశారని తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ, లోయర్ సీలేరులో తెలంగాణ వాటా కింద వచ్చే విద్యుత్ ను ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. కృష్ణపట్నంలో తమ వాటా కరెంటు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలని హరీష్ రావు తెలిపారు. అన్నీ తెలిసిన చంద్రబాబు తెలంగాణకు కరెంటు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై ప్రేమ ఉంటే విభజన చట్టంలో పేర్కొన్న విద్యుత్ వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News