: గ్రేట్ థింగ్స్ హేపెన్డ్...అలాగే 'శివ' కూడా జరిగింది: రాంగోపాల్ వర్మ
'గ్రేట్ థింగ్స్ హేపెన్డ్' అని ఓ మహానుభావుడు అన్నట్టు 'శివ' సినిమా కూడా అలాగే రూపుదిద్దుకుందని ఆ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపాడు. 'శివ' సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 'శివ' సినిమా మోడల్ లాంటిదని అన్నారు. అప్పటి వరకు ఓ మూసలో వెళ్లిపోతున్న తెలుగు సినిమా దశ, దిశను మార్చిన సినిమా 'శివ' అని పేర్కొన్నారు. 'శివ' సినిమాలాంటి సినిమాను మరోసారి తీయడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. 'శివ' సినిమాలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ నూటికి నూరుపాళ్ల శ్రమను పెట్టుబడిగా పెట్టారని, అందుకే అంత అద్భుతంగా వచ్చిందని ఆయన తెలిపారు.