: తమిళనాడులో హోటళ్లు, బస్సులు ధ్వంసమవుతున్నాయి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో తమిళనాట ఆగ్రహజ్వాలలు రగిలాయి. అన్నా డీఎంకే కార్యకర్తలు, జయలలిత అభిమానులు ఆందోళనకు దిగారు. చెన్నైలోని ఎంజీఆర్ నగర్ లోని ఉడిపి హోటల్ పై దాడికి దిగారు. ఫర్నిచర్, సామగ్రి ధ్వంసం చేశారు. కర్ణాటకకు చెందిన బస్సులపై దాడికి దిగి ధ్వంసం చేశారు. ఆందోళనకారులు ఇంకా శాంతించలేదు. దీంతో షాపులు మూతపడ్డాయి.