: ఒకే వీసాపై ఆ రెండు దేశాలు చుట్టేయొచ్చు
ఇకపై భారతీయులు ఒకే వీసాపై యూకే, ఐర్లాండ్ దేశాలు చుట్టేయొచ్చు. ఈ మేరకు ఐర్లాండ్, యూకే లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయని యూకే హోం సెక్రటరీ థెరిస్సా మే వెళ్లడించారు. చైనీయులకు ఈ సౌకర్యం అక్టోబర్ నుంచే అందుబాటులోకి రానుండగా, భారతీయులకు మాత్రం డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుంది. ఐర్లాండ్, యూకే మధ్య సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ఈ అంగీకారపత్రంపై సంతకం చేశామని రెండు దేశాల ప్రతినిథులు పేర్కొన్నారు.