: బెయిల్ నిరాకరించడంతో కుప్పకూలిన జయ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తనకు బెయిల్ మంజూరవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆమె ఆశలను వమ్ముచేస్తూ... అసలు జయకు బెయిల్ ఎందుకివ్వాలని కర్ణాటక హైకోర్టు ప్రశ్నించింది. అవినీతి అనేది మానవ హక్కుల ఉల్లంఘన లాంటిదని సుప్రీంకోర్టు చెప్పిన సంగతిని గుర్తు చేస్తూ... జయకు బెయిల్ నిరాకరించింది. దీంతో, అప్పటివరకు బెంగళూరు జైల్లో ఉత్కంఠగా టీవీ చూస్తూ గడిపిన జయ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. జైల్లోని డాక్టర్లు ఆమెకు హుటాహుటిన వైద్యం అందిస్తున్నారు.