: కళ్ళు చెదిరే రీతిలో ఐఎస్ఎల్ ప్రారంభోత్సవానికి నిర్వాహకుల ప్లాన్


భారత్ లో ఇప్పటివరకు కొన్ని సాకర్ లీగ్ లు జరిగినా, అవి జాతీయ స్థాయికే పరిమితం. కానీ, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పేరిట తెరపైకి వచ్చిన సాకర్ లీగ్ అంతర్జాతీయ స్టార్లతో అభిమానులకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది. ఈ చాంపియన్ షిప్ ఈ నెల 12న ఆరంభం కానుంది. సాయంత్రం ఐదింటికి మొదలయ్యే ప్రారంభోత్సవ వేడుకలకు కోల్ కతాలోని వివేకానంద యువ భారతి క్రీడాంగణ్ వేదిక. ఈ టోర్నీ ప్రారంభోత్సవాన్ని కళ్ళు చెదిరే రీతిలో నిర్వహించేందుకు ఐఎంజీ-రిలయన్స్ భాగస్వామ్య సంస్థ, స్టార్ ఇండియా సన్నాహాలు చేస్తున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాంఛనంగా టోర్నీని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, వరుణ్ ధావన్ తమ ప్రదర్శనతో అలరించనున్నారు. ఆయా రంగాలకు చెందిన మహామహులు ఈ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొంటారు. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ తదితరులు హాజరవుతారు. ఇక, లీగ్ లో పాల్గొనే ఆయా ఫ్రాంచైజీలు యజమానులు, ఆటగాళ్ళు సరేసరి.

  • Loading...

More Telugu News