: జయలలితకు బెయిల్ నిరాకరణ


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ జరగాలి. కనుక జయలలిత కేసులో తుది నిర్ణయం తీసుకోలేమని న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఆమెకు బెయిల్ మంజూరు కాలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు బెయిల్ ఇస్తే అప్పుడు ఆమెకు బెయిల్ మంజూరవుతుంది. లేని పక్షంలో బెయిల్ రానట్టే! కాగా, ఆమెకు బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తే కనుక తమకు అభ్యంతరం లేదని సీబీఐ కూడా చెప్పింది. దీంతో దేశంలోని మీడియా సంస్థలన్నీ జయలలితకు బెయిల్ మంజూరైందంటూ వార్తలు ప్రసారం చేశాయి. అలా జరిగిన కాసేపటికే బెయిల్ ఇవ్వడం లేదంటూ న్యాయస్థానం తీర్పు వెలువరిచింది.

  • Loading...

More Telugu News