: భౌతిక శాస్త్రంలో ముగ్గురు జపనీయులకు నోబెల్ ప్రైజ్
భౌతిక శాస్త్రంలో 2014 సంవత్సరానికి గానూ ముగ్గురు జపనీయులకు నోబెల్ బహుమతి లభించింది. ఇసము అకాసకి, హిరోషి, అమనో, షుజీ నకమురా అనే ముగ్గురు సైంటిస్టులకు సంయుక్తంగా రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ ప్రైజ్ ప్రకటించింది. తక్కువ శక్తితో ఎక్కువ వెలుగు నిచ్చే, పర్యావరణ అనుకూల 'బ్లూ ఎల్ఈడీ'ని వీరు ఆవిష్కరించారు. ఈ బ్లూ ఎల్ఈడీతో కాంతి కోసం మనం వినియోగించుకుంటున్న శక్తిని గణనీయంగా తగ్గించుకునే వీలుంది.