: సుద్దాల అశోక్ తేజకు 'కొమరం భీం పురస్కారం'
'కొమరం భీం' జాతీయ పురస్కారం-2014కు గానూ ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ ఎంపికయ్యారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ పురస్కార ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు అభ్యుదయ గేయాలు, సామాజిక రచనల ద్వారా కొమరం భీం ఆశయసాధన కోసం డాక్టర్ సుద్దాల కృషి చేస్తున్నందుకే ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అవార్డు నిర్వాహకులు తెలిపారు. పురస్కారం కింద రూ. 50,116 నగదు, జ్ఞాపిక, సన్మాన పత్రం అందిస్తారు. ఈ అవార్డును కొమరం భీం స్మారక ఉత్సవ పరిషత్, ఆదివాసి సంస్కృతి, భారత కల్చరల్ అకాడమి, ఓం సాయితేజా ఆర్ట్స్ సంయుక్తంగా ప్రదానం చేయనున్నాయి.