: భార్య ఉసురు తీసిన మట్కా
మట్కా (సట్టా) ఆ కుటుంబంలో చిచ్చు రేపింది. ఏకంగా హత్యకు కారణమైంది. వివరాల్లోకి వెళ్లే, సికింద్రాబాద్ ప్రాంతంలోని తిరుమలగిరిలో ఓ వ్యక్తి మట్కాకు బానిసగా మారాడు. సంపాదన మొత్తం మట్కా ఆటకే వెచ్చించేవాడు. దీంతో, అతని భార్య అతడిని వారించేది. మట్కా ఆడనివ్వకుండా అతడిని అడ్డుకునేది. ఈ నేపథ్యంలో, ఆమెపై కోపం పెంచుకున్న అతను ఏకంగా ఆమెను హత్య చేశాడు. అంతేకాకుండా, హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో విషయం బయటపడింది. దీంతో, హంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.