: ప్రభుత్వం దిగిరావాలి... లేకపోతే, నిరవధిక నిరాహారదీక్షలే: జూడాలు
హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో జూడాలు తమ ధర్నాను ఉద్ధృతం చేశారు. గ్రామాల్లో ఏడాది పాటు తప్పనిసరి సేవలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, శాశ్వత నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు. తమ డిమాండ్లతో వారు గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. వెంటనే ప్రభుత్వం దిగి రావాలని... తమ డిమాండ్లకు అంగీకరించాలని... లేకపోతే నిరవధిక నిరాహారదీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఇప్పటికే గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం ఆసుపత్రుల్లో సేవలను బహిష్కరించామని తెలిపారు.