: జయలలిత బెయిల్ పిటిషన్ పై కర్ణాటక హైకోర్టులో వాదనలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ పై కర్ణాటక హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ ఆమె తరపున వాదనలు వినిపిస్తున్నారు. జయ ఆరోగ్య కారణాల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. విచారణ జరుగుతున్న క్రమంలో తప్పించుకుని ఎక్కడికీ వెళ్లరని చెప్పారు. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో జయ పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.