: మైఖేల్ ఫెల్ప్స్ పై ఆరు నెలల నిషేధం
పద్దెనిమిది సార్లు ఒలింపిక్స్ స్విమ్మింగ్ ఛాంపియన్ గా నిలిచిన మైఖేల్ ఫెల్ప్స్ పై అమెరికా స్విమ్మింగ్ బోర్డు ఆరు నెలల పాటు నిషేధం విధించింది. దాంతో, వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ ఛాంపియన్ షిప్ లో అతనికి చోటు దక్కలేదు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం పలు కారణాలతో గత వారం తన సొంత ఊరు బాల్టీమోర్ లో ఫెల్ప్స్ అరెస్టవడంతో ఈ చర్యలు తీసుకున్నారు.