: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఈసీ నోటీసు
కేంద్ర రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎన్నికల సంఘం నోటీసు పంపింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల కిందట లాతూరులో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో నేతలు ఇచ్చే డబ్బులను కాదనకుండా తీసుకుని, అప్పుడు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని ఓటర్లకు సూచించారు. ఈ వ్యాఖ్యలు కాస్తా ఈసీ దృష్టికి వెళ్లడంతో రేపటిలోగా వివరణ ఇవ్వాలని అధికారులు కోరారు. మరోవైపు తన మాటల్లో ఎలాంటి తప్పులేదని మంత్రి గడ్కరీ అంటున్నారు.