: నాణ్యమైన బౌలర్లు లేకుండా ధోనీ ఏమీ చేయలేడు: శాస్త్రి


టీమిండియా కోచింగ్ డైరక్టర్ రవిశాస్త్రి జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై భారత జట్టు పరాజయాల పట్ల స్పష్టమైన అభిప్రాయాలు వెలిబుచ్చాడు. నాణ్యమైన బౌలర్ల అండ లేకుండా కెప్టెన్ ధోనీ ఏమీ చేయలేడని అన్నాడు. టెస్టుల్లో మన బౌలర్లు 20 వికెట్లు తీసుకోవడంలో విఫలమవుతున్నారని తెలిపాడు. ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేయగలిగితేనే విజయావకాశాలు మెరుగవుతాయని అభిప్రాయపడ్డాడీ మాజీ ఆల్ రౌండర్. సమర్థులైన బౌలర్లు లేని కారణంగా ధోనీ చేతులు కట్టేసినట్టవుతోందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో బౌలర్లు గాయాలబారిన పడడం మన విజయావకాశాలను ప్రభావితం చేసిందని తెలిపాడు.

  • Loading...

More Telugu News