: ట్విట్టర్ లో షారుక్ మూడో కుమారుడి ఫొటో
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తన మూడో కుమారుడు అబ్ రాం ఖాన్ తొలి ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు. అటు ఫేస్ బుక్ లోనూ అదే ఫొటోను ఉంచాడు. దాంతో బయటి ప్రపంచానికి, అభిమానులకు తన ముద్దుల కొడుకును మొదటిసారి, అదీ ఈద్ పండుగ సందర్భంగా పరిచయం చేశాడు. తన మోకాలిపై కుమారుడిని కూర్చోబెట్టుకుని షారుక్ ముద్దాడుతూ ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియా సైట్లలో హల్ చల్ చేస్తోంది. "అందరికీ ఈద్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికీ జీవితమంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మా చిన్నాడు కూడా మీకు విషెస్ చెబుతున్నాడు" అని ఖాన్ ట్వీట్ చేశాడు. గతేడాది మే 27న అద్దె గర్భం ద్వారా అబ్ రాం జన్మించాడు.