: రాజధాని కోసం లక్ష ఎకరాలు ఎందుకు?: మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం లక్ష ఎకరాలు ఎందుకంటూ మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ ప్రశ్నించారు. అసలు రాజధాని నిర్మాణం కోసం చేపట్టనున్న భూ సమీకరణపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సకల హంగులతో అలరారుతున్న హైదరాబాద్ వెయ్యి ఎకరాల పరిధిలోనే నిర్మితమైందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారుల జేబులు నింపేందుకే చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆరోపించారు. వీజీటీఎం-వుడా పరిధిలోని 23 వేల ఎకరాల పరిధిలో రాజధానిని నిర్మిస్తే సరిపోతుందన్నారు. విలువైన సాగు భూములను ఇతర అవసరాల కోసం వినియోగించడాన్ని మానుకోవాలని ఆయన సూచించారు.