: మెట్రోపొలిస్ సదస్సును ప్రారంభించిన కేసీఆర్
హైదరాబాద్ ప్రతిష్ఠను మరింత పెంచే మరో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. మెట్రోపొలిస్ ప్రపంచ మేయర్ల సదస్సును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. హైటెక్స్ లో జరుగుతున్న ఈ సదస్సును కేసీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించారు. టీఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ స్వాగతోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కీలకోపన్యాసం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రపంచంలోని పలు నగరాల మేయర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు.