: ఆసుపత్రి నుంచే మంత్రి గారి కార్యకలాపాలు!
తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి చాలా కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో, డాక్టర్ల సలహా మేరకు ఆయన యశోద ఆసుపత్రిలో ఇటీవల మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీని తర్వాత కూడా డాక్టర్లు ట్రీట్ మెంట్ కొనసాగిస్తుండటంలో ఆయన ప్రస్తుతం యశోదా ఆసుపత్రి నుంచే తన కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నారు. అత్యవసరమైన ఫైళ్లను ఆయన అక్కడి నుంచే గత కొన్ని రోజులుగా క్లియర్ చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో యశోదా ఆసుపత్రి నుంచి నాయిని డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.